ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఎండి కైసర్ పాషా
సూర్య.నేరడిగొండ: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జిల్లా మద్యమిక విద్యాధికారి ఎండి కైసర్ పాష ఆకస్మిక తనిఖీ చేశారు. అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సూచించారు. కళాశాల రికార్డులను ఆయన తనిఖీ చేశారు. జిల్లా మాధ్యమిక విద్యాధికారి విద్యార్థులతో మాట్లాడి వారు రాసిన నోట్స్ ను తనిఖీ చేశారు. అలాగే వచ్చే వార్షిక పరీక్షలను ఉత్తీర్ణత శాతం పెరగాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నూతనంగా నియమించబడిన ఎండి కైసర్ పాషా ను కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షబానా తరన్నం, సూపర్ డెంట్ షేక్ మోసిన్, అధ్యాపకులు సుభాష్ ప్రవీణ్, ఉపేందర్, తదితరులు ఉన్నారు