BREAKING
పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వెల్దుర్తి ఎంపీపీగా తోళ్ల మద్దిలేటి ప్రమాణం ఎంపీటీసీలతో ప్రమాణం చేయించిన ఆర్వో శ్రీదేవి ఘనంగా సన్మానించిన నేతలు.. అధికారుల అభినందనలు తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య

ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ మహేష్, మంత్రులు సీతక్క, పొన్నం

Select Suryaa Now
ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ మహేష్, మంత్రులు సీతక్క, పొన్నం

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దివంగత ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ రావు, మాజీ మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. యావత్ ప్రపంచం ఉక్కు మహిళగా కీర్తించిన ఇందిరా గాంధీ దేశాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఆమె ఇచ్చిన 'గరీబీ హటావో' నినాదం పేదల అభ్యున్నతి పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. గుడిసెలు లేని గ్రామాలు ఉండాలనే సంకల్పంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇందిరా గాంధీ విశేష కృషి చేశారని గుర్తుచేశారు. దేశం కోసం అనునిత్యం శ్రమించిన ఆమె సేవలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందిరమ్మ పేరుతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

సోనియా గాంధీ రచించిన పుస్తకాన్ని చదవాలి
ఇందిరా గాంధీ కోడలు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఆ పుస్తకం ద్వారా ఇందిరా గాంధీ జీవిత విశేషాలు, దేశం కోసం ఆమె చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాల గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆశయాలను ఆచరణలో కొనసాగించడమే ఆమెకు మనం అందించే ఘనమైన నివాళి అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.