పెళ్లిరోజున మొక్క నాటిన మాజీ జెడ్పీటీసీ ఉమ కొండయ్య దంపతులు.
సూర్య బోయినపల్లి ..తమ పెళ్లిరోజు పురస్కరించుకొని బోయినపల్లి మాజీ జెడ్పీటీసీ ఉమ కొండయ్య దంపతులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కరీంనగర్‌లోని తమ నివాస ఆవరణంలో మొక్క నాటారు.మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న వారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం భావితరాలకు కోట్లాది మొక్కలు నాటించిన ఈ కార్యక్రమంలో భాగంగా తమ పెళ్లిరోజున మొక్క నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, కన్నం సాగర్, జంగిడి సంజీవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.