BREAKING
రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్ జాతీయ క్రీడల్లో జిల్లా యువత సత్తా చాటాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఎంపీపీగా రాజన శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నిక గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి - వరికొయ్యలను కాల్చవద్దు రాత్రికి రాత్రే ఆంధ్రకేసరి ప్రకాశం విగ్రహం తొలగించే ప్రయత్నం: అడ్డుకున్ విగ్రహ సాధన కమిటీ అనంతపురం రూరల్ మండల ఎంపీపీగా చల్లా జయకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక పొనకల్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ పై చర్చ • సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ మండలం ఉపాధ్యక్షురాలు రాఘవేంద్ర స్వామి ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా ఎల్లారం గ్రామంలో సమగ్ర భూసర్వేపై అవగాహన సదస్సు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా అరేబియన్ గుర్రాల కోసం పాట్రిక్ స్వైజ్ నిర్మించుకున్న కాలిఫోర్నియా రాంచ్.. కోట్ల విలువైన ఆస్తి విశేషాలివే!

ఎల్లారం గ్రామంలో సమగ్ర భూసర్వేపై అవగాహన సదస్సు

Select Suryaa Now
ఎల్లారం గ్రామంలో సమగ్ర భూసర్వేపై అవగాహన సదస్సు

సూర్య, లక్షెట్టిపేట :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వేలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు భూముల సమగ్ర రీ సర్వే జరగలేదని, ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేతో భూముల వివరాలను పక్కాగా నమోదు చేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామాన్ని సమగ్ర భూసర్వేకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ సర్వే ద్వారా గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, వ్యక్తిగత భూముల హద్దులను డిజిటల్ విధానంలో గుర్తించి నమోదు చేయనున్నట్లు వివరించారు. అలాగే భూ యజమానులకు కొత్తగా భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు భూముల వివరాల్లో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడిశల రాజేశం, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ దిలీప్, ఆర్ఐ శ్రీలత, సర్వేయర్ సైదులు, జీపీఓ భూషణం, పంచాయతీ కార్యదర్శి వరుణ్, వార్డు సభ్యులు సత్యనారాయణ, రూప వెంకటేష్, లక్ష్మి మల్లేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తార సత్తయ్య, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.