BREAKING
ఎంపీపీగా సిద్ధి సునీత ప్రమాణ స్వీకారం కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్.. పియర్స్ బ్రోస్నన్ ఆశీర్వాదం, అభినందనలు అట్టహాసంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం మహోత్సవం టైమ్100 నెక్స్ట్ ఇండియా కవర్‌పై ఆలియా భట్.. భారతీయ సినిమా గ్లోబల్ అంబాసిడర్ అంటూ రాజమౌళి ప్రశంసలు భోగాపురం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ! వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక ఆళ్లగడ్డ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శీలం గీతా వాణి యే ప్రేమ్ మోల్ లియా వర్సెస్ రాకీ ఔర్ రాణీ.. ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ! మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. రాబర్ట్ ప్యాటిన్సన్ అత్యంత పిరికి జేమ్స్ బాండ్.. క్రిస్టోఫర్ నోలన్ సరదా వ్యాఖ్యలు! గోపవరం మండలంఎంపిపి గా నారపురెడ్డి వేణు జడ్పీ చైర్మన్ల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు.. ఓజెంపిక్, కాస్మెటిక్ సర్జరీ పుకార్లపై ఫ్లోరెన్స్ పగ్ ఘాటు కౌంటర్.. నెటిజన్లకు కీలక సూచన!

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

Select Suryaa Now
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన


రాజేంద్రనగర్ , మేజర్ న్యూస్: గొంతునొప్పితో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన జామ జగన్ అనే వ్యక్తి మృతి చెందడం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. జల్‌పల్లి గ్రామానికి చెందిన జగన్ గురువారం ఉదయం 6 గంటలకు పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న టీఆర్‌జీ శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరాడు. అయితే వైద్యులు సరైన పరీక్షలు, చికిత్స అందించకపోవడం వల్లే ఆయన మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

అంకం జగన్, మేజర్ న్యూస్, రాజేంద్రనగర్