గోపవరం మండలంఎంపిపి గా నారపురెడ్డి వేణు
గోపవరం మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలపరిషత్ అధ్యక్షునిగా రాచాయపేట ఎంపీటీసీ సభ్యుడు నారపురెడ్డి వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 5 ఎంపీటీసీ స్థానాలున్న గోపవరం మండలంలో, గురువారం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికను మండల ప్రత్యేక అధికారి స్థానిక మండల సభాభవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బ్రాహ్మణపల్లె, బేతాయపల్లె ఎంపీటీసీలు నారపురెడ్డి వేణు ను అధ్యక్షుని బలపరచగా , మిగిలిన కాలువపల్లి, గోపవరం ఎంపీటీసీ సభ్యులు తమ మద్దతును తెలిపారు. దీంతో నారపురెడ్డి వేణు గోపవరం మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కాగా ఉపాధ్యక్ష పదవికి జరగాల్సిన ఎన్నికను శుక్రవారం, కో ఆప్షన్ సభ్యుని ఎంపిక త్వరలో నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి తెలిపారు.
రిపోర్టర్.. టి ప్రసాద్.. గోపవరం మండలం ..కడప జిల్లా