మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం
కోటబొమ్మాళి, నవంబరు 19, మేజర్ న్యూస్:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండల ప్రజా పరిషత్ నూతన పాలకవర్గ నియామకం గురువారం జరిగింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) తర్ర రామకృష్ణ, వైస్ ఎంపీపీగా కల్లి యమునా రెడ్డి, మండల విప్‌గా బొడ్డాపు రాంబాబు నియమింపబడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు మార్గదర్శకత్వంలో మండల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలు పేర్కొన్నారు.
రిపోర్టర్: గంట అప్పన్న