సర్పంచ్‌గా ఎన్నికైన బొమ్మన సుబ్బరాయుడుకు ఘనంగా అభినందనలు.
బద్వేలు మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మండలం రాజుపాలెం
సర్పంచ్‌గా ఏకగ్రీవంగాఎన్నికైన బొమ్మన సుబ్బరాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీ చైతన్య రాష్ట్ర సమితి అధ్యక్షులు బీసీ రమణ, నిమ్మకాయల మహేశ్వర్ రెడ్డి, బద్వేల్ బిజెపి పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య ప్రదీప్ రాజు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అందరినీ కలుపుకుని, పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని సర్పంచ్ బొమ్మన సుబ్బరాయుడు తెలిపారు. తనకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు, తనను అభినందించిన నాయకుల కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్... సి రవికుమార్
బద్వేల్ ఇంచార్జ్.. కడప జిల్లా