BREAKING
ఎంపీపీ ఎన్నికల టెన్షన్.. జనసేన ఎమ్మెల్యే అలక లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల జర్నీ నోట్‌పై నెటిజన్ల ఆగ్రహం! పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ నాపై డాక్యుమెంటరీ తీస్తే తప్పేంటి? విమర్శకులకు నయనతార ఘాటు సమాధానం! నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్ ఖరారు.. తొలి చిత్రం విడుదలకు ముందే సాత్విక వీరవల్లికి గోల్డెన్ ఛాన్స్ జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ: పాత మ్యాజిక్‌ను మళ్లీ అందుకున్నారా.. నవ్వులు పండించిందా? ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన కరణ్‌కోట్ నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డి జనవరి 12 విడుదల ప్రమోషన్లలో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం.. కృతి శెట్టితో దళపతి సీన్ రీక్రియేట్ సూర్య కథనానికి అధికారులు స్పందన! ఈ నెల 15న ప్రచురితమైన కథనంపై గురువారం స్పందన కోర్టు వివాదంలో ఉన్నట్లు బోర్డు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు పత్రిక కథనంపై అధికారుల స్పందనకు ప్రజల అభినందనలు నూతన ఎంపిపి గా ఈడిగ లక్ష్మి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్

పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ

Select Suryaa Now
పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక  వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు..   మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ

పరిగి మేజర్ న్యూస్:

పరిగి మండల పరిషత్‌కు నూతన నాయకత్వం కొలువుదీరింది. గురువారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో 17 మంది ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం RO, ఎంపీడీఓ సమక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఈ ఎన్నికల్లో ఎంపీపీగా కె. శాంతమ్మ, వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎంపీపీ కె. శాంతమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీపీ బాధ్యతలు అప్పగించిన ఎంపీటీసీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పరిగి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. మండల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పరిగి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీపీ కె. శాంతమ్మ స్పష్టం చేశారు.

 

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్