వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : శింగణమల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అనంతపురం నుంచి శింగణమలకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.