BREAKING
చిట్టమూరు సర్పంచ్ అభ్యర్థిగా గణపర్తి సుశీలమ్మ నామినేషన్ దాఖలు సుశీలమ్మకు మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేసిన జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి కంబదూర్ మండలం ఎంపీపీగా తిమ్మక్క, వైస్ఎం పీపీగా గొల్ల దేవేంద్ర ఎంపిక ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి!* *నందిగాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 14 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం* నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. బద్వేలు మండల ఎంపీపీగా మడితాటి అపూర్వ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఘనంగా సీనియర్ రాజకీయ నాయకులు జాపాల సుధాకర్ జన్మదిన వేడుకలు శ్రీ శుక్రవారం దేవి జగదాంబ మాత వార్షికోత్సవలు - ఈ నెల 19 నుండి 21వరకు మూడు రోజుల పాటు జాతర వేడుకలు భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్

భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

Select Suryaa Now
భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

గుంటూరు: భూ సమీకరణపై అందుతున్న అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. సి.ఆర్.డి.ఏ రెండవ విడత భూ సమీకరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిడమర్రు, నవులూరులో 22(ఏ) క్రింద ఉన్న అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జలవనరులు గల ప్రదేశాలపై స్పష్టమైన అవగాహన తో ముందుకు వెళ్ళాలని అన్నారు. రైల్వే లైన్ కు అవసరమగు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ కొల్లా బత్తుల కార్తీక్ మాట్లాడుతూ రైల్వే నుండి డ్రాయింగ్ లు రావలసి ఉందన్నారు. 1153 అభ్యంతరాలు మొత్తం అందాయ న్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, సి.ఆర్.డి.ఏ డిప్యూటీ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్