BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు.

Select Suryaa Now
హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు.

హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు..


హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:


హిందూపురం పట్టణ పరిధిలోని ప్రజలందరికీ , వ్యాపారస్తులకు మున్సిపల్ కమిషనర్ ముఖ్యమైన ఆదేశాలు ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజూ మీ ఇంటి వద్దకు మరియు మీ వ్యాపార సంస్థలు/ దుకాణాల వద్దకే నేరుగా వచ్చి చెత్తను సేకరించడం జరుగుతుంది. కావున పట్టణంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మరియు వ్యాపార సంస్థలలో ఉత్పత్తి అయ్యే చెత్తను మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించవలసిందిగా కోరారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై, వీధుల్లో, ఖాళీ స్థలాల్లో, డ్రైనేజీలలో లేదా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదు. ఈ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం గుర్తించినట్లయితే, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ప్రకారం సంబంధిత వ్యక్తులపై రూ.1,000/- నుండి రూ.2,000/- వరకు జరిమానా విధించబడును.
ఒకవేళ చెత్త సేకరణ వాహనాలు  ఈ- ఆటోస్  మీ ఇంటి వద్దకు లేదా మీ దుకాణాలు, వ్యాపార సంస్థల వద్దకు రాకపోయినట్లయితే, వెంటనే హిందూపురం మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ *టోల్ ఫ్రీ నెం. 18004252633* కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
కావున ప్రజలు మరియు వ్యాపారస్తులు మున్సిపాలిటీకి సహకరించి, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు హిందూపురం పట్టణాన్ని *"స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన"* పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించా లని కోరారు.

నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ ఎం.నాగరాజు హిందూపురం