BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు

Select Suryaa Now
వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు


సైబరాబాద్,మేజర్ న్యూస్ :  వంద మందికి పైగా పాల్గొనే కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 5(1)(j) ప్రకారం ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది.ఈ సందర్భంగా
అనుమతి లేని ప్రదేశాల్లో వంద మందికి పైగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించేవారు కనీసం మూడు పనిదినాల ముందుగానే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ఈవెంట్‌ ఇంటిమేషన్‌ పోర్టల్‌ ద్వారా సంబంధిత స్థానిక సంస్థకు సమాచారం ఇవ్వాలి. కార్యక్రమం జరిగే ప్రదేశంలో తడి, పొడి తదితర వ్యర్థాలను నిర్దేశిత వర్గాలుగా వేరు చేయాలి. వాటిని స్థానిక సంస్థ గుర్తించిన అధీకృత సేకరణదారులు లేదా ఏజెన్సీలకు అప్పగించాలి. వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతిలో పారవేతకు నిర్వాహకులే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.ఈ నిబంధనలపై ఫంక్షన్‌ హాళ్ల యాజమాన్యాలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, కార్యక్రమాల నిర్వాహకులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ కమిషనర్లను కమిషనర్‌ ఆదేశించారు. CPCB పోర్టల్‌ వినియోగం, ముందస్తు సమాచారం సమర్పణపై వివరించాలన్నారు. నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, శానిటేషన్‌ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్‌ పరిధిలో జరిగే అన్ని బహిరంగ కార్యక్రమాలు, సమావేశాల్లో ఈ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు