BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు

Select Suryaa Now
అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు

రూరల్ లో ఊపందుకున్న సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

- గ్రామాలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ హామీలు

-పలు పంచాయతీలలో రెండు పార్టీలలో విచిత్ర పరిస్థితులు 
- 
- - టిడిపిలో అసమ్మతి వర్గాలు వైసీపీ అభ్యర్థికి మద్దతు, వైసీపీలోనీ అసమ్మతి వర్గాలు టిడిపి అభ్యర్థికి మద్దతు 
- 
- లోపాయికార ఒప్పందాలతో ఏ గ్రామాలలో ఏ అభ్యర్థులను ముంచుతాయో ?
 


అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  అనంతపురం రూరల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక ప్రచారం  ఊపందుకుంది. ఈనెల 18న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన ముగియడంతో... ఎన్నికల బరిలో నిలిచిన  టిడిపి, వైసీపీ మద్దతు దారుల అభ్యర్థులు... గురువారం నుంచి పూర్తిస్థాయి ప్రచార పర్వంలోకి దిగారు.   ఉదయం నుంచి.. గ్రామాలలో ఇరు పార్టీల మద్దతు దారుల సర్పంచులు .. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి.. ఇంటింటికి తిరుగుతూ.. ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టారు.ఎన్నికల ప్రచారంలో గ్రామాలలో ప్రధానంగా టిడిపి మద్దతు దారుల అభ్యర్థులు.. గ్రామ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే.. టిడిపి మద్దతు అభ్యర్థులను గెలిపించుకోవాలని, రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం  మరో రెండున్నర సంవత్సరాలు..  అధికారంలో ఉంటుందని... సర్పంచ్ అభ్యర్థిగా.. మమ్మల్ని గెలిపిస్తే.. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సహకారంతో గ్రామంలో రోడ్లు వేయిస్తామని, తాగునీటి సమస్య చూపుతామని,  ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు, పింఛన్లను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూస్తామని హామీలు ఇస్తున్నారు.  మరోవైపు ప్రతిపక్ష వైసిపి పార్టీ మద్దతు దారుల అభ్యర్థులు కూడా గత రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో వైఫల్యం చెందిందని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఇవ్వలేదని...  ప్రజలకు వివరిస్తూ ఎన్నికల నిర్వహిస్తున్నారు. వైసిపి మద్దతు దారులను గెలిపించుకోవడం ద్వారానే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ కావడం ఖాయమని, గ్రామాలలో సుపరిపాలన అందిస్తామని వివరిస్తున్నారు. ఇవే కాకుండా మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం వచ్చే వారికి రోజు బిర్యానిలు, మద్యం, డబ్బు కూడా సర్పంచ్ అభ్యర్థులు సమకూరుస్తున్నారు. వీటితోపాటు ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం, డబ్బు పంపిణీ కూడా చేసేందుకు.. కూడా మార్గాలు ఎదుర్కొంటున్నారు.


కొన్ని గ్రామాలలో టిడిపి, వైసీపీ పార్టీలలో విచిత్ర పరిస్థితులు

రూరల్ మండలంలో పలు గ్రామాలలో టిడిపి, వైసీపీ పార్టీల మధ్య విచిత్ర పరిస్థితిలో నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో.. వైసీపీకి ఎంపీటీసీ సీట్ల దక్కించుకున్న అభ్యర్థులకు.. అదే పార్టీలోని కొందరు నాయకులు, కార్యకర్తలు.. వ్యతిరేకంగా పని చేసి టిడిపికి అనుకూలంగా ఓటు వేయించారు. మరికొన్ని పంచాయతీలలో.. టిడిపి ఎంపీటీసీ సీట్లు దక్కించుకున్న అభ్యర్థికి.. అదే పార్టీలో  వ్యతిరేకవర్గం వారు.. వైసీపీ పార్టీ అభ్యర్థికు పని చేయడంతో  టిడిపి అభ్యర్థిలు పలు స్థానాలలో ఓడిపోయారు.  ఆ ఎన్నికల్లో దెబ్బతిన్న అభ్యర్థులు,  వ్యతిరేకవర్గం వారు  ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో పార్టీలకు అతీతంగా టిడిపి వారు వైసిపి వారితో, వైసిపి వారు టిడిపి వాళ్ళతో.. లోపాయికార.. ఒప్పందాలు చేసుకొని.. సొంత పార్టీ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని ప్రభావం మండలంలో ఏ గ్రామంలో.. ఏ పార్టీ అభ్యర్థి గెలుపోవటంపై ప్రభావం చూపుతుందోన్న ఆందోళన  మొదలైంది.