వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్
చందానగర్,మేజర్ న్యూస్ : మియాపూర్ సర్కిల్ సీఎంసీ పరిధిలోని ఏఎంసీలు, టీఐలు, బీసీలతో ఆస్తి పన్ను (Property Tax) సంబంధిత అంశాలపై డీసీ శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PTIN) కేటాయింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న IGRS స్లాట్ బుకింగ్‌ల క్లియరెన్స్, పెండింగ్ ఆస్తి పన్ను సేవల దరఖాస్తుల పరిష్కారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, నవంబర్ 2026 కు నిర్దేశించిన ఆస్తి పన్ను వసూళ్ల పై సమీక్షించారు.ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ ప్రతి ఏఎంసీ, టీఐ, బీసీకి ప్రత్యేక లక్ష్యాలను కేటాయించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజా ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని, IGRS స్లాట్ బుకింగ్‌లను క్లియర్ చేసి PTIN కేటాయింపులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ నెలకు నిర్దేశించిన ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను గడువులోగా సాధించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు