BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
 కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను  పరిశీలించిన జిల్లా ఎస్పీ

సూర్య జగిత్యాల ప్రతినిధి:జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న చందనోత్సవాల సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ చందనోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎస్పి  వెంట డిఎస్పి పురుషోత్తం రెడ్డి, మల్యాల సిఐ రాజ్ కుమార్, ఎస్.ఐ లు సందీప్, నరేష్  సిబ్బంది పాల్గొన్నారు.