భారత దేశ ఔన్నత్యం గొప్పది
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలో గురువారం శ్రీ సాయి వాణి ఫంక్షన్ హాల్ నందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 101వ జన్మదిన వేడుకలు సందర్భంగా పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు బాలచంద్ర గారిచే విజయం సాధించడం ఎలా అంశంపై ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఔన్నత్యం గల దేశం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు సత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.