నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు..
షాద నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్
ఫరూఖ్ నగర్ రంగారెడ్డి:
నీటిని వృథా చేయకుండా ప్రతి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రస్తుతం నీటి వసతుల పరిస్థితులు బాగా లేవని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్‌నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట లీకేజీ పైప్‌లైన్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, కౌన్సిలర్లు సి. పెంటయ్య, మురళీమోహన్ తదితరుల తో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. నీరు వృథా కాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ప్రత పెట్టుకుని నీటి బొట్టు బంగారంతో సమానమని వృధా చేస్తే భవిష్యత్తుకే ప్రమాదమని, వినియోగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైనంత నీటిని మాత్రమే వినియోగించుకోవాలని, కుళాయిల వద్ద నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నీరు ప్రకృతి ప్రసాదించిన విలువైన సంపద అని, భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పట్టణంలో ఎక్కడైనా తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు గుర్తిస్తే వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముబారక్ అలీ ఖాన్, భరత్ లోహోటీ, మున్సిపల్ సిబ్బంది ఇలియాస్, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ ముదిరాజ్, అజయ్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నరసింహ రెడ్డి మేజర్ న్యూస్….