BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ

Select Suryaa Now
అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళ్యాణమండపంలో నిర్వహించిన చేయూత పింఛన్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి,   డీసీలు శ్రీనివాస్, బాలకృష్ణ, ప్రాజెక్టు అధికారి సురేష్, సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ మియాపూర్, మాదాపూర్  సర్కిళ్ల పరిధిలోని 957 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. అర్హులైన వారుఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,కార్యకర్తలు  లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.