BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

Select Suryaa Now
ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి.....  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

మియాపూర్‌,మేజర్ న్యూస్ : ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం కాకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. మియాపూర్‌ సర్వే నంబర్లు 100, 101లోని సుమారు 550 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవికుమార్‌ యాదవ్‌, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎం.ఏ. నగర్‌ కాలనీని సందర్శించి, ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి దక్కిన విలువైన భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాల కోసం విక్రయించాలని చూడటం సరికాదన్నారు.మిగిలిన సుమారు 400 ఎకరాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, పార్కులు ఏర్పాటు చేయడంతోపాటు నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని సూచించారు. తరతరాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి, గవర్నర్‌కు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే శేరిలింగంపల్లి నుంచే ఉద్యమం ప్రారంభించి రాష్ట్రవ్యాప్త పోరాటం చేపడతామని రామచంద్రరావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు సింధు రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సీతారామ రాజు,ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు విజయేందర్ సింగ్, కార్యదర్శి మాణిక్ రావు, రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ గౌడ్, రాఘవేంద్ర రావు, వసంత్ యాదవ్,నరేష్, టాక్ సభ్యులు బుచ్చి రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ గణేష్ ముదిరాజ్, రమేష్  డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్, శ్రీనివాస్,కృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, రాజు యాదవ్, రవి నాయక్, కిషోర్ , స్థానిక నాయకులు మన్యం, బాలు, ముకేష్, కిరణ్ , మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.