వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి* నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, షబ్బీర్ దేశాయ్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు అందరూ సమిష్టిగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థిని, వార్డు నెంబర్లను అత్యధికంగా గెలిపించుకొని రావాలని నాగలదిన్నె పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీలో కలిసికట్టుగా ముందుకు పోవాలన్నారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడే కాకుండా సీనియర్ పాత్రికేయుడు అందరికీ సుపరిచితుడే.. ఆయన చేరికతో నందవరం మండలంలో కాస్త వైసిపికి బలం పెరిగిందని చెప్పవచ్చు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్, తిమ్మప్ప, నాగప్ప,అత్తావుల్లా, షేక్ అహమ్మద్,,రాజేష్, బొంబాయి రాజు వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
*A. R.శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లా.*