పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్..
మక్కువ, నవంబర్ 19, మేజర్ న్యూస్ :-
నేడు జరగనున్న మండల పరిషత్ అధ్యక్షు ఎన్నికల ఏర్పాట్లను పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత రహన్ గురువారం ఉదయం పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి శ్రీనివాసరావు , ఇంచార్జ్ ఎంపీడీవో, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పణిభూషణరావులకు సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ కు మొక్కు మండల ఎన్నికల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో షేక్ ఇబ్రహీం , ఆర్ ఐ కే శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
టి తిరుపతిరావు, మక్కువ, మన్యం జిల్లా