ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే
సూర్య జగిత్యాల ప్రతినిధి:భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో సుమారు 31 వేల కుటుంబాలకు ఈ పథకం కింద రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీశ్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొలిశెట్టి గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.