వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్
సూర్య, జన్నారం : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకొని అభివృద్ధి చెందాలని అప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం మండలం పొనకల్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన చేయూత పథకం పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేతుల మీదుగా అందజేశారు. మార్కెట్ యార్డులో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కేంద్రాన్ని బొజ్జు పటేల్ ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రానికి రాగానే రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే తూకం చేయాలన్నారు. పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కేంద్రాన్ని మహిళలకు అప్పగించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డిఆర్డిఓ దాసరి అంజయ్య, ఎమ్మార్వో బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఐకెపి ఎపిఎం లలిత కుమారి, చింతగూడ, పొనకల్ సింగిల్ విండో చైర్మన్లు నాసాని రాజన్న, అల్లం రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసియుల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర నందు నాయక్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇసాక్, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముజఫర్ అలీ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, జిల్లా మండల నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్ష కార్యదర్శులు కుదిరే వెంకన్న, దినేష్ పవర్, ముత్యం సతీష్, మాజీ పొనకల్ సర్పంచ్ జక్కు భూమేష్, ముత్యం రాజన్న, రాగుల శంకర్, ఐకెపి సెంటర్ నిర్వాహకులు శాంతి, చిలువేరి గంగామణి, రమ తదితరులు పాల్గొన్నారు.