BREAKING
మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన : కురబలకోట గ్రంధాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే జీటీఏ సిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్ అభ్యర్థి మార్పుతో రగిలిన అసమ్మతి.. ఎమ్మెల్యే ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన షేక్ హసీనా పార్టీ నిరసనల వేళ మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు ఏఐ అమ్మకాల జోరుతో లెనోవో ఆదాయం 48 శాతం వృద్ధి మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష ఐరోపా మార్కెట్లపై అంతర్జాతీయ మదుపర్ల దృష్టి 2017 నిర్బంధం నుంచి ఐక్యరాజ్యసమితి న్యాయస్థానం తీర్పు వరకు దశాబ్ద ప్రస్థానం అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైన గేదె. 550 బిలియన్ డాలర్ల అమెరికా పెట్టుబడులలో జపాన్ పాత్ర మరింత పెరగాలి

విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన : కురబలకోట గ్రంధాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి

Select Suryaa Now
విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన : కురబలకోట గ్రంధాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి

 

కురబలకోట,మేజర్ న్యూస్ : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం కురుబలకోట శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యత,ఉపయోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించి విద్యార్థులకు గ్రంథాలయాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.పుస్తక పఠనం ద్వారా జ్ఞానం,విజ్ఞానం పెంపొందించుకోవడంతోపాటు,విద్యార్థులు తమ అభ్యసన సామర్థ్యాన్ని,ఆలోచనా శక్తిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.గ్రంథాలయాలు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అదేవిధంగా మహిళల ప్రాముఖ్యత,మహిళల అభివృద్ధి,సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాల గురించి కూడా విద్యార్థులకు వివరించారు.ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకొని,గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఎం.నాగమణి,కె.జనార్దన్‌తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి