BREAKING
2017 నిర్బంధం నుంచి ఐక్యరాజ్యసమితి న్యాయస్థానం తీర్పు వరకు దశాబ్ద ప్రస్థానం అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైన గేదె. 550 బిలియన్ డాలర్ల అమెరికా పెట్టుబడులలో జపాన్ పాత్ర మరింత పెరగాలి గ్రీన్‌లాండ్ ఒప్పందంపై డెన్మార్క్ పార్లమెంటు కీలక ఓటింగ్ లైట్ డే మైలురాయి చేరుకున్న వాయేజర్-1 ప్రమాదాలకు అడ్డాగా తుర్కయంజాల్ విలేజ్ రోడ్డు. మధ్య గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిక్స్ విడుదల జావా ప్రోగ్రామింగ్ లోపంపై ప్రపంచ దేశాల హెచ్చరిక ఐటీ షేర్ల అమ్మకాలు, ఫెడ్ వడ్డీ ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు డీలా తొలి టెస్టు టీ విరామానికి న్యూజిలాండ్ 140/5.. నికోల్స్, ఫిలిప్స్ ఆదుకున్న వైనం కర్తవ్య దీక్ష, ఆత్మగౌరవంలో రాజీ పడలేదు.. ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రధాని మోదీ నివాళులు కువైట్‌లోని స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు ఎన్విడియా నిర్ణయం తెలివైనది కాదు: ఎలాన్ మస్క్ ఆదర్శ వెల్దుర్తి నిర్మాణమే లక్ష్యంగా అడుగులు ప్రజాసేవ వారసత్వం.. అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో తిరివీధి రమేష్ శెట్టి అన్ని వర్గాల మద్దతుతో పంచాయతీ పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వైనం

ఆదర్శ వెల్దుర్తి నిర్మాణమే లక్ష్యంగా అడుగులు ప్రజాసేవ వారసత్వం.. అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో తిరివీధి రమేష్ శెట్టి అన్ని వర్గాల మద్దతుతో పంచాయతీ పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వైనం

Select Suryaa Now
ఆదర్శ వెల్దుర్తి నిర్మాణమే లక్ష్యంగా అడుగులు ప్రజాసేవ వారసత్వం.. అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో తిరివీధి రమేష్ శెట్టి అన్ని వర్గాల మద్దతుతో పంచాయతీ పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వైనం

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రముఖ పారిశ్రామికవేత్త తిరివీధి రమేష్ శెట్టి (టీవీ రమేష్) ఎన్నికల బరిలో నిలిచి ముమ్మర ప్రచారంతో దూసుకుపోతున్నారు. దశాబ్దాల ప్రజాసేవ వారసత్వానికి తోడు, అధికార పార్టీ అండదండలు, అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగడుతూ ఆయన ప్రచారంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.  

సేవా వారసత్వం.. స్వచ్ఛమైన పాలనే ధ్యేయం

తిరివీధి కుటుంబానికి వెల్దుర్తి రాజకీయాల్లో విశిష్ట స్థానం ఉంది. గతంలో రమేష్ శెట్టి పూర్వీకులు, తండ్రి కీ.శే. టీవీ శివయ్య సుమారు 15 నుంచి 18 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా పనిచేసి, ఎలాంటి వివాదాలు లేకుండా నిస్వార్థమైన సేవలందించారని స్థానిక నేతలు గుర్తుచేస్తున్నారు. కీ.శే. టీవీ శివయ్య, కీ.శే. టీవీ సత్యనారాయణ ఆశీస్సులతో, 28 ఏళ్ల పాటు తమ కుటుంబం అందించిన సుదీర్ఘ పాలనా స్ఫూర్తితో తాను ప్రజల ముందుకు వస్తున్నట్లు రమేష్ శెట్టి పేర్కొంటున్నారు. నాడు తమ తండ్రి చేసిన ప్రజాసేవ బాటలోనే, నేడు తాను కూడా ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన అందిస్తానని ఆయన భరోసా ఇస్తున్నారు.  

అధికార పార్టీ అండదండలతో అభివృద్ధి పరుగులు

‘ఆదర్శ వెల్దుర్తి’ నిర్మాణమే తన ప్రధాన లక్ష్యమని రమేష్ శెట్టి స్పష్టం చేస్తున్నారు. పట్టణంలో మెరుగైన పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని 16వ వార్డులో పర్యటించిన ఆయన, అక్కడ పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. తనకు అధికార పార్టీ అండదండలు సంపూర్ణంగా ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధులను మరింత వేగంగా వెల్దుర్తికి తీసుకువచ్చి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కరించేలా ముందుంటానని స్పష్టం చేస్తున్నారు.  

వార్డుల వారీగా పక్కా వ్యూహం.. మహిళల మద్దతు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రమేష్ శెట్టి వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల 6, 7 వార్డుల సభ్యుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించగా, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా 7వ వార్డు అభ్యర్థిగా తిరువీధి పూర్ణలతను ప్రకటించారు. ప్రతి వార్డులోనూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, సర్పంచ్ గెలుపునకు అందరూ సహకరించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.  

మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక హామీలు

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తాను అన్నివిధాలా అండగా నిలుస్తానని రమేష్ శెట్టి భరోసా కల్పిస్తున్నారు. ప్రచారంలో భాగంగా పట్టణంలోని 14వ వార్డు మదీనా మసీదు, పెద్ద మసీదులలో ముస్లిం పెద్దలు, స్థానికులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తానని పేర్కొన్న ఆయన, సర్పంచ్‌గా గెలిపిస్తే మజీద్ ప్రాంగణంలో సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు అనువుగా షెడ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుపేద ముస్లిం కుటుంబాల్లో జరిగే వివాహాలకు అవసరమైన వంట సామాగ్రిని అందించడంతో పాటు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు.  

ఆర్యవైశ్యుల ఐక్యత.. అగ్రనేతల ఆశీస్సులు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ) ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు వెల్దుర్తిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశమై ఏకాభిప్రాయంతో విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో వెల్దుర్తి పట్టణానికి విచ్చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబును రమేష్ శెట్టి, ఆర్యవైశ్య సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ను కూడా రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.  

కలిసికట్టుగా కదులుతున్న శ్రేణులు

రమేష్ శెట్టి విజయాన్ని కాంక్షిస్తూ కుటుంబ సభ్యులు, ప్రముఖులు, వివిధ వర్గాల నాయకులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో తిరివీధి డాక్టర్ రాంప్రసాద్, తిరివీధి సుధీంద్ర, తిరివీధి సాయిప్రసాద్, తిరివీధి సురేంద్ర, తిరువీధి డాక్టర్ రాంకుమార్, అత్తలూరి కిరణ్, ఒంగోలు సాయి తదితరులతో పాటు ముస్లిం మైనారిటీ నాయకులు హఫీజ్, హుస్సేన్ బాషా, ఎస్. ఈదురు భాష, మసాలా మౌలాలి, హోటల్ మబాషా, బోరింగ్ మాభూసా, ముబారక్ టైలర్ తదితరులు పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. అందరి ఆశీస్సులతో వెల్దుర్తి మేజర్ పంచాయతీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా రమేష్ శెట్టి ప్రచార పర్వం ఉత్సాహంగా కొనసాగుతోంది.