BREAKING
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారా?..జాడలేని ఫుడ్ సేఫ్టీ అధికారులు! జ్యువెల్ హైట్స్‌లో వైభవంగా శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆంథ్రోపిక్ భారీ ఐపీవో ధర ఖరారు సామాజిక న్యాయ, సాధికారత శాఖ సదస్సు ముగింపు వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగం బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన సాంప్రదాయ వైద్యం, ఔషధ మొక్కల పరిరక్షణలో భారత్-బుర్కినా ఫాసో కీలక చర్చలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా వైసీపీకి షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు ఉమామహేశ్వరి & వెంకట సుబ్రహ్మణ్య నిఖిల్ శర్మ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని పరామర్శించిన నారం రాజశేఖర్* బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్ గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం… అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి

బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన

Select Suryaa Now
బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,  జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం–2026లో భాగంగా దత్తత ప్రక్రియ, ఫోస్టర్ కేర్ విధానం, దత్తత తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు ఐ సి పి ఎస్ లక్ష్మిఅవగాహన కల్పించారు.  సీడీపీఓ సాఫ్ఫారున్నిషా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ  బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కులు, సంరక్షణ, భద్రత, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు.అదేవిధంగాబాల్య వివాహ రహిత భారతదేశం  100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పోక్సో  చట్టంపై అవగాహన కల్పించి, బాలలపై లైంగిక వేధింపుల నివారణ, రక్షణ చర్యలు, చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సూపర్వైజర్లు నాగలక్ష్మి భాగ్యలక్ష్మి నీలమ్మ గురు సేకరమ్మ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. 
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*