దేవనకొండ ఎంపిపి ఎన్నిక వాయిదా..?
దేవనకొండ మండలంలో నేడు జరగాల్సిన యంపీపీ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.కూటమిలో భాగంగా యంపీపీ పదవిని టీడీపీ కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ సతీమణి లక్ష్మీకి ఎన్నుకొని ఎన్నికలకు వెళ్లారు.అయితే కూటమిలో భాగంగా టిడిపి10 యంపిటిసి స్థానాలు జనసేన 3 స్థానాల్లో విజయం సాధించడంతో లక్ష్మీ ఎన్నిక లాంఛనమే అనుకుంటున్న సందర్భంలో నేడు జనసేన ఇంచార్జీ వెంకప్ప తమ జనసేన యంపిటిసి అభ్యర్థికి యంపీపీ ఇస్తున్నారంటూ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మండలంలో ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.అనుకున్న విధంగా కాకుండా జనసేన నాయకులు వెంకప్ప కూటమిలో చిచ్చు పెడుతున్నారంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో నేడు జరగాల్సిన యంపీపీ ఎన్నిక వాయిదా పడటం తథ్యమని తెలుస్తోంది.