BREAKING
పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దేవనకొండ ఎంపిపి ఎన్నిక వాయిదా..? నేడు తేలనున్న పాములపాడు ఎంపీపీ పీఠం.. కొనసాగుతున్న ఉత్కంఠ బంగారంలో రేనియం కల్తీ కలకలం.. సాధారణ పరీక్షల్లోనూ తప్పుదోవ పట్టించే ఫలితాలు? సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కంబదూర్ మండలం, కూరకులపల్లి లో వై ఎస్ ఆర్ విగ్రహానికి నిప్పు... పలువారిపై దాడి వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్నా - -జిల్లా ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు. సమస్యలు తీర్చాలసిన పోలీసులే సమస్యలు సృష్టిస్తున్నారు - సైన్స్ మ్యూజియంలో కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి.. పరిగిలో ప్రైవేటు ఆసుపత్రిలో విషాదం.. వైద్యం వికటించి బాలిక మృతి వరి కోతలను వాయిదా వేసుకోవాలి ప్రోటోకాల్ విహదంతో నిలిచిన చేయూత పెన్షన్ల పంపిణీ గండి యాకయ్య చిత్రపటానికి నివాళులు పేదల సంక్షేమానికి పెద్ద పీట జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి

సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Select Suryaa Now
సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, మేజర్ న్యూస్: అందరి సమిష్టి నిర్ణయం, కృషి, సహకారంతో తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైనన్ని నిధులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తీసుకొస్తానని స్పష్టం చేశారు. బుధవారం తాండూరులోని హంస గ్రాండ్ హోటల్‌లో మాస్టర్ ప్లాన్ అమలుపై వ్యాపారులు, రియల్టర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రస్తుత మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ చైర్మన్లు, ఇతర ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పట్టణంలోని కాలనీలు ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయా ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చడంతో పాటు రహదారులు, మురుగునీటి కాల్వలు నిర్మించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ పట్టణ సమగ్ర అభివృద్ధి ఒక్కరి నిర్ణయంతో సాధ్యమయ్యేది కాదని, అందరి అభిప్రాయాలు, సహకారంతోనే సాధ్యమవుతుందని అన్నారు. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తాండూరు-వికారాబాద్ రహదారి విస్తరణకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని, ఒక లేన్ నిర్మాణం పూర్తయిందని, మరో మూడు లేన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. కొడంగల్-చించోళి రహదారి పనులు వేగంగా సాగుతున్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. భూసేకరణ బాధితులకు రూ.25 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేసి పనులు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. చిలుకవాగు పనులు కొనసాగుతున్నాయని, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆటో, లారీ స్టాండ్లను పట్టణం వెలుపలకు తరలిస్తామని తెలిపారు. భవిష్యత్తులో పాలిషింగ్ యూనిట్లను కూడా జీనుగుర్తికి తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించిన ఎమ్మెల్యే, తాండూరును ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరిన్ని నిధులు తీసుకొస్తానని, సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్లు విశ్వనాథం గౌడ్, లక్ష్మారెడ్డి, విజయలక్ష్మి, స్వప్న, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మురళీకృష్ణ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్, పలువురు వ్యాపారవేత్తలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.