సమస్యలు తీర్చాలసిన పోలీసులే సమస్యలు సృష్టిస్తున్నారు -
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల పై పోలీసులు పైషాచికం గా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్తలు, నాయకులును అలాగే క్రోసూరు ఎస్సై లాఠీ దెబ్బలకు గాయపడి సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళలను మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పరామర్శించారు. ఈ ఘటనపరంగా వారు మాట్లాడుతూ వై యస్ ఆర్ సీపీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలలోకి వెళ్ళనివ్వకుండా పోలీసులే ఆపుతున్నారు. అలాగే నామినేషన్ కేంద్రాల్లో టీడీపీ గుండాలు పెట్టి దాడులు చేపిస్తున్న కూటమి నాయకులు కు పోలీసు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు అని అన్నారు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలపై ఎస్సై దాడి చేసి మరల బాధితులపై కేసులు కట్టి అరెస్టు చేసి సత్తెనపల్లి తీసుకొని వెళ్లారని తెలిసి బాధితులకు అండగా నిలబడేందుకు సత్తెనపల్లి డి.ఎస్.పి ఆఫీస్ కి వచ్చి అధికారులతో మరియు అడిషనల్ ఎస్పీ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వెళ్ళిపోయినా పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ ఇలాంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.