సైన్స్ మ్యూజియంలో కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి..
కోస్గి నవంబర్19(సూర్య న్యూస్):భారత అణు శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని కోస్గిలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియంలో పెట్టాలని ఎంఐఎమ్ మండల పార్టీ అధ్యక్షుడు అంజాద్ ఖాన్ డిమాండ్ చేశారు.గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారత శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిన కలాం నేటి తరాలకు స్పూర్తినిచ్చే మహానియుడని అన్నారు.సైన్స్ మ్యూజియంలో అనేక మంది శాస్త్రవేత్తల చిత్రపటాలు పెట్టారని,అబ్దుల్ కలాం చిత్రపటం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి కోస్గి సైన్స్ మ్యూజియంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు..