BREAKING
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారా?..జాడలేని ఫుడ్ సేఫ్టీ అధికారులు! జ్యువెల్ హైట్స్‌లో వైభవంగా శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆంథ్రోపిక్ భారీ ఐపీవో ధర ఖరారు సామాజిక న్యాయ, సాధికారత శాఖ సదస్సు ముగింపు వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగం బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన సాంప్రదాయ వైద్యం, ఔషధ మొక్కల పరిరక్షణలో భారత్-బుర్కినా ఫాసో కీలక చర్చలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా వైసీపీకి షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు ఉమామహేశ్వరి & వెంకట సుబ్రహ్మణ్య నిఖిల్ శర్మ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని పరామర్శించిన నారం రాజశేఖర్* బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్ గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం… అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి

వైసీపీకి షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు

Select Suryaa Now
వైసీపీకి  షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు


మార్టూరు, మేజర్‌న్యూస్‌ :

మార్టూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్టూరు టౌన్ మాజీ వైసీపీ అధ్యక్షుడు, మాజీ గ్రామ ఉపసర్పంచ్ కాకోలు రామారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 22 కుటుంబాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే ఏలూరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ కాకోలు రామారావు ప్రజా జీవితంలో నిజాయితీగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామారావు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని, పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాకోలు రామారావుతో పాటు మువ్వ కృష్ణయ్య, మువ్వ నాగేశ్వరరావు, పాపిశెట్టి రవి, కొనకంచి హనుమంతరావు, ఉప్పుటూరి జానకిరామ్, కాకోలు పుల్లారావు, కాకోలు వెంకటరావు, కాకోలు నాగరాజు, కాకోలు అభిలాష్, కాకోలు శ్రీనివాసరావు, పులుగు బానురెడ్డి, ములగాని నవీన్ రెడ్డి, దాసరి రమణ, కాకోలు వెంకటేశ్వరరావు, చింతలపూడి సుబ్బారావు, మక్కెన నాగబాబు, మన్నెం రామారావు, గడ్డం కరీముల్లా, నాగేంద్ర, బుడంగుంట్ల కళ్యాణ్, గుంటూరు గోపి, మర్రి గోపి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
మార్టూరు పట్టణంలో ఒకేసారి 23 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.