ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని పరామర్శించిన నారం రాజశేఖర్*
*సూర్య,అశ్వారావుపేట,ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని అశ్వారావుపేట మండల సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ యువ నాయకులు నారం రాజశేఖర్ పరామర్శించారు.
అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పండువారిగూడెం గ్రామానికి చెందిన ఊకే భవాని నిన్న ట్రాక్టర్‌పై పనికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడడంతో చేతికి బలమైన గాయమైంది.హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న భవాని నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ నాయకులు సున్నం కృష్ణ, యువ నాయకులు కణితి సంజయ్, దుర్గారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట