సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా
సూర్య ఉట్నూర్ :గుడిహత్నూర్ మండలం తోషం తాండా గ్రామంలో సచ్యూరేషన్ క్యాంపెయిన్ కార్య క్రమాన్ని సర్పంచ్ జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధాం హాజరై మాట్లాడుతూ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడం అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం లక్ష్యం అన్నారు. కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆధ్వ ర్యంలో ఆర్థిక సమ్మిళిత సంతృప్తి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరు గుతుందనీ తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించి అర్హులైన ఖాతాదారులు లేదా వారి చట్టబద్ధ వారసులు వాటిని తిరిగి పొందేందుకు అవసరమైన దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పిస్తు న్నారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడంతో పాటు, ప్రభుత్వ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫీల్డ్ ఆఫీసర్ భవనా, ఎస్బిఐ సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ప్రవీణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.