BREAKING
ఏపీ, ఒడిశా తీరాల వైపు దూసుకురాక.. మూడు రైళ్ల సమయం మార్పు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు వీడిన దేవనకొండ కూటమి ఎంపిపి ఉత్కంఠ.. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా సక్కారం నిఖిల్ - బాల్కొండ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ గా కొండా రామ్ గౌడ్ నియమకం నందవరం ను నందవనం చేసుకోవడానికి ఏకగ్రీవంగా చేస్తే రూ.50 లక్షల విరాళం పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ 'అక్వాన్'.. ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ నేటి నుంచి హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ అక్వాన్ తుపాను ప్రభావం.. తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక బ్లూనామి హరిత ఇంధన ఊపు.. ఆశించిన స్థాయికి చేరుతుందా? ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ శిఖరాగ్ర భేటీ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ ఆంథ్రోపిక్ ఐపీవో విజయంతో ఏఐ షేర్లకు కొత్త ఊపిరి ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఊగిసలాట నవంబర్ 26న కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ.. ప్రభుత్వం కీలక ప్రకటన

నందవరం ను నందవనం చేసుకోవడానికి ఏకగ్రీవంగా చేస్తే రూ.50 లక్షల విరాళం

Select Suryaa Now
నందవరం ను నందవనం చేసుకోవడానికి ఏకగ్రీవంగా చేస్తే రూ.50 లక్షల విరాళం

 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి, అభివృద్ధి కి ఆమడ దూరంలో వున్న మండల కేంద్రము నందవరం నునందనవనం గా మార్చుకోవడానికి సర్పంచ్ గా సంగీత దేశయ్ ని ఏకగ్రీవం చేస్తే రూ. 50 లక్షలు అభివృద్ధి కై అందిస్తా అని దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజు దేశాయి ఓ ప్రకటనలో ప్రకటించారు.నందనవనం గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని దేశాయ్ నెట్‌వర్క్ అధినేత గురురాజు దేశాయ్ కోరారు. తన భార్య సంగీత దేశాయ్‌ను గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.50 లక్షలు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా గురురాజు దేశాయ్ మాట్లాడుతూ.. గ్రామంలో రాజకీయ పార్టీలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎన్నికల సమయంలో పోటీలు, విభేదాల వల్ల అనవసర ఖర్చులు, మనస్పర్థలు ఏర్పడుతున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితులకు తావులేకుండా గ్రామ ప్రజలందరూ చర్చించుకుని ఏకాభిప్రాయంతో సర్పంచిని ఎన్నుకోవాలని కోరారు. సంగీత దేశాయ్ విద్యావంతురాలని, గతంలో కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. విద్యావంతులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం తోనే మండల కేంద్రం అభివృద్ధి చెయడానికి వీలు ఉంటుంది అన్నారు.గత కొన్ని దశాబ్దాలుగా నందవరం గ్రామ అభివృద్ధికి. మా కుటుంబం చేరిన సేవా కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని సంగీత దేశాయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రకటించిన రూ.50 లక్షలతో పాటు గ్రామానికి అవసరమైన మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా అన్నారు.
*
అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి*

నందవరం గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానని గురురాజు దేశాయ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం ప్రభావానికి గురిచేయకుండా, నిస్వార్థంగా అందరూ కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు.మన పక్క మండలాలైన గోనెగండ్ల, పెద్దకడుబూరు, కోసిగి మండలాలు అభివృద్ధిలో ముందున్నాయని, నందవరం మండలం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈసారి ప్రజలంతా మార్పును కోరుకుంటూ, ఓటుకు డబ్బు ఆశించకుండా గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయకుండా, పారదర్శకంగా వినియోగిస్తూ గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిస్వార్థంగా కృషి చేసే నాయకత్వానికి అవకాశం కల్పించాలని గురురాజు దేశాయ్ కోరారు. 
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*