BREAKING
జావా ప్రోగ్రామింగ్ లోపంపై ప్రపంచ దేశాల హెచ్చరిక ఐటీ షేర్ల అమ్మకాలు, ఫెడ్ వడ్డీ ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు డీలా తొలి టెస్టు టీ విరామానికి న్యూజిలాండ్ 140/5.. నికోల్స్, ఫిలిప్స్ ఆదుకున్న వైనం కర్తవ్య దీక్ష, ఆత్మగౌరవంలో రాజీ పడలేదు.. ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రధాని మోదీ నివాళులు కువైట్‌లోని స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు ఎన్విడియా నిర్ణయం తెలివైనది కాదు: ఎలాన్ మస్క్ ఆదర్శ వెల్దుర్తి నిర్మాణమే లక్ష్యంగా అడుగులు ప్రజాసేవ వారసత్వం.. అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో తిరివీధి రమేష్ శెట్టి అన్ని వర్గాల మద్దతుతో పంచాయతీ పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వైనం ఏపీ, ఒడిశా తీరాల వైపు దూసుకురాక.. మూడు రైళ్ల సమయం మార్పు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు వీడిన దేవనకొండ కూటమి ఎంపిపి ఉత్కంఠ.. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా సక్కారం నిఖిల్ - బాల్కొండ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ గా కొండా రామ్ గౌడ్ నియమకం నందవరం ను నందవనం చేసుకోవడానికి ఏకగ్రీవంగా చేస్తే రూ.50 లక్షల విరాళం పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ 'అక్వాన్'.. ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ నేటి నుంచి హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్

ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా సక్కారం నిఖిల్ - బాల్కొండ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ గా కొండా రామ్ గౌడ్ నియమకం

Select Suryaa Now
ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా సక్కారం నిఖిల్ - బాల్కొండ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ గా కొండా రామ్ గౌడ్ నియమకం

సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలంలోని చౌట్‌పల్లిలో బుధవారం భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఓబీసీ మోర్చా పదాధికారుల నియామక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్‌గా కొండ రామ్ గౌడ్, కమ్మర్ పల్లి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సక్కారం నిఖిల్ నియమితులయ్యారు. నూతనంగా నియమితులైన పదాధికారులను నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ. ఓబీసీ మోర్చా పార్టీకి వెన్నెముక లాంటిదని అన్నారు. నూతన పదాధికారులు గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేస్తూ, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓబీసీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మోర్చా నాయకులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు వర్ణం శ్రీధర్, బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, ఇతర పలు మండల అధ్యక్షులు,బీజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.