BREAKING
జీటీఏ సిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్ అభ్యర్థి మార్పుతో రగిలిన అసమ్మతి.. ఎమ్మెల్యే ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన షేక్ హసీనా పార్టీ నిరసనల వేళ మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు ఏఐ అమ్మకాల జోరుతో లెనోవో ఆదాయం 48 శాతం వృద్ధి మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష ఐరోపా మార్కెట్లపై అంతర్జాతీయ మదుపర్ల దృష్టి 2017 నిర్బంధం నుంచి ఐక్యరాజ్యసమితి న్యాయస్థానం తీర్పు వరకు దశాబ్ద ప్రస్థానం అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైన గేదె. 550 బిలియన్ డాలర్ల అమెరికా పెట్టుబడులలో జపాన్ పాత్ర మరింత పెరగాలి గ్రీన్‌లాండ్ ఒప్పందంపై డెన్మార్క్ పార్లమెంటు కీలక ఓటింగ్ లైట్ డే మైలురాయి చేరుకున్న వాయేజర్-1 ప్రమాదాలకు అడ్డాగా తుర్కయంజాల్ విలేజ్ రోడ్డు. మధ్య గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిక్స్ విడుదల జావా ప్రోగ్రామింగ్ లోపంపై ప్రపంచ దేశాల హెచ్చరిక

అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైన గేదె.

Select Suryaa Now
అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైన గేదె.

కుందుర్ప := అడవి పందులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు అమర్చిన పేలుడు పదార్థాల కేపుకు మూగజీవి బలైన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేత కోసం వెళ్లిన రైతు పరమేష్‌కు చెందిన గేదె, అడవి పందుల వేట కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన కేపును ఆహారంగా భావించి నమలడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గేదె మూతి భాగం తీవ్రంగా పగిలి, తీవ్ర గాయాలపాలైంది. రక్తస్రావంతో విలవిల్లాడిన గేదె చివరకు ప్రాణాలు కోల్పోయింది. అడవి పందులను వేటాడేందుకు కొందరు వ్యక్తులు పొలాలు, అటవీ ప్రాంతాల సమీపంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో కేపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మేత కోసం వెళ్లిన గేదె వాటికి బలైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పంటలను కాపాడుకునే పేరుతో కొందరు వ్యక్తులు ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రమాదకరమైన ఉచ్చులు అడవి జంతువులతో పాటు పశువుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవి మృతితో రైతు పరమేష్‌కు ఆర్థిక నష్టం వాటిల్లింది. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పొలాలు, గ్రామాల పరిసరాల్లో అక్రమంగా పేలుడు పదార్థాలు అమర్చే వారిపై అటవీ శాఖ, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించడంతో పాటు బాధిత రైతు పరమేష్‌కు తగిన పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.