మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఎల్ నీ నో ప్రభావం దృష్ట్యా ప్రజలకు నిరంతరాయంగా, మెరుగైన తాగునీటిని అందించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, నీటి సరఫరా సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సమావేశంలో ఏఈ లు చందన్, కృష్ణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.