BREAKING
వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది చంపాపేట్ లో ప్రోటోకాల్ రగడ కాంగ్రెస్ - బిఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట ఐదు మండల పరిషత్ లను కూటమి కైవసం చేసుకొంది. ఎమ్మెల్యే కోటి రూపాయల గ్రంథాలయం.. నిర్వహణకు ఒక్కరే సిబ్బంది ఆపదలో ఆపన్నహస్తం.. బాధితుడికి అండగా డా.మహేందర్‌రెడ్డి!

ఐదు మండల పరిషత్ లను కూటమి కైవసం చేసుకొంది. ఎమ్మెల్యే

Select Suryaa Now
ఐదు మండల పరిషత్ లను కూటమి కైవసం చేసుకొంది. ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండల పరిషత్‌లను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవడం ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని అన్నారు. గురువారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన ఎంపీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అమిలినేని బీ-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావులేకుండా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సైతం నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల్లో కూటమి సాధించిన విజయానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణమని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పింఛను మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచేందుకు ఐదేళ్ల సమయం పట్టిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు రూ.4 వేలు, రూ.6 వేలు, రూ.15 వేల వరకు వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లే కూటమి అభ్యర్థులకు ప్రజలు అఖండ విజయాన్ని అందించారని అన్నారు. ఈ క్రమంలో కుందుర్పి మండల వైస్ ఎంపీపీ పదవిని కూటమి ధర్మాన్ని పాటిస్తూ బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో వ్యక్తిగత విభేదాలతో గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారి విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 26న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి, కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు, కార్యక్రమాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన బీటీపీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసుకుని కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే కళ్యాణదుర్గం ప్రాంతం సస్యశ్యామలంగా మారడంతో పాటు రైతులకు సాగునీటి సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీ అభ్యర్థులు పాల్గొన్నారు.