telangana
చంపాపేట్ లో ప్రోటోకాల్ రగడ కాంగ్రెస్ - బిఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని చంపాపేట్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన చేయుత పత్రాల పంపిణీ రసాభాసగా మారింది. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి,ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సభా వేదిక మీద ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూర్చోవడం వల్ల సుధీర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట మధ్య మాటల యుద్ధం తో పరిసరాలు మారు మ్రోగాయి.