శ్రీ శుక్రవారం దేవి జగదాంబ మాత వార్షికోత్సవలు - ఈ నెల 19 నుండి 21వరకు మూడు రోజుల పాటు జాతర వేడుకలు
సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే శ్రీ శుక్రవారం దేవి జగదాంబ మాత వార్షికోత్సవము జాతర వేడుకలు కార్తీక మాసము ఈ నెల 19 నుండి 21 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు కార్థిక శుద్ధ దశమి గురువారం రోజున గణపతి గౌరీ పూజ, స్వప్తపుణ్యపావాచనం, వాస్తు మలప, రెండవ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి శుక్రవారం రోజున బోనాలు, మాహ చండీయాగం, కుంకుమార్చన, మహా అన్న ప్రసాద వితరణ, సాయంత్రం డోలోత్సవ, భజన, నృత్య, కోలాటాలు, మూడవరోజు కార్తిక శుద్ధ చిలకు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, బలిహరణం, పూర్ణాహుతి, కోనేటి స్నానము, కుంకుమభిషేకం కార్యక్రమాలు ఉంటాయని కావున భక్తులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ వేడుకల కార్యక్రమన్ని విజయవంతం చెయ్యాలని గ్రామ అభివృద్ధి కమిటీ కోరారు. వెంకటరమణ చార్యులు ఆలయ అర్చకులు, చౌట్ పల్లి గంగ ప్రసాద్ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ పూజలు జరుగును.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని మన గ్రామ దేవి జగదాంబ మాత బోనాల వార్షికోత్సవ జాతర ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది కావున గ్రామ ప్రజలు, మహిళలు, పిల్లలు చుట్టుపక్క గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరు పాల్గొని విజయవంతం చేయాలనీ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు కోరారు.