BREAKING
చిట్టమూరు సర్పంచ్ అభ్యర్థిగా గణపర్తి సుశీలమ్మ నామినేషన్ దాఖలు సుశీలమ్మకు మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేసిన జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి కంబదూర్ మండలం ఎంపీపీగా తిమ్మక్క, వైస్ఎం పీపీగా గొల్ల దేవేంద్ర ఎంపిక ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి!* *నందిగాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 14 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం* నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. బద్వేలు మండల ఎంపీపీగా మడితాటి అపూర్వ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఘనంగా సీనియర్ రాజకీయ నాయకులు జాపాల సుధాకర్ జన్మదిన వేడుకలు శ్రీ శుక్రవారం దేవి జగదాంబ మాత వార్షికోత్సవలు - ఈ నెల 19 నుండి 21వరకు మూడు రోజుల పాటు జాతర వేడుకలు భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.

బ్రహ్మసముద్రం: నూతన వధూవరులను ఆశీర్వదించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధికి హామీలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వేకువజామునే పల్లెల్లో పర్యటించారు. బ్రహ్మసముద్రం మండలం తిప్పయ్యదొడ్డి గ్రామానికి చెందిన మాస్టర్ బాలయ్య ఆహ్వానం మేరకు ఆయన కుమార్తె రాధమ్మ, సతీష్‌ల వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను అభినందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మసముద్రం మండలంలోని నంజాపురం, తిప్పయ్యదొడ్డి, యర్రప్పదొడ్డి గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే గ్రామాలకు వస్తున్నారన్న సమాచారంతో స్థానిక ప్రజలు, నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే స్థానికంగా నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల అనంతరం నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నారు. అదేవిధంగా తిప్పయ్యదొడ్డి గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్థులతో కలిసి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలను గ్రామస్థులతో చర్చించారు. గ్రామాల్లో విద్య, ఆధ్యాత్మికతతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వేకువజామునే ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకం కావడం, పాఠశాల భవన నిర్మాణం, ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.