చిట్టమూరు సర్పంచ్ అభ్యర్థిగా గణపర్తి సుశీలమ్మ నామినేషన్ దాఖలు సుశీలమ్మకు మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేసిన జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి
చిట్టమూరు మేజర్ న్యూస్
మండల కేంద్రమైన చిట్టమూరు పంచాయితీ అభ్యర్థిగా దివంగత గణపర్తి సుబ్రహ్మణ్యం నాయుడు (అన్నయ్య నాయుడు) సతీమణి,తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల కన్వీనర్ కిషోర్ నాయుడు తల్లి గణపర్తి సుశీలమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా తాజా జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి గణపర్తి సుశీలమ్మకు మద్దతుగా ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వరవాక శివకోటారెడ్డి,స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్