నేటి నుండి దేవనకొండ నూతన పాలక వర్గం
దేవనకొండ మండల నూతన పాలక వర్గం గురువారం మండల పరిషత్ కార్యాలయం నందు ట్రైనీ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.20 మంది యంపీటీసీలలో కూటమి నుండి 13 మంది ఎంపిటిసిలు వైకాపా నుండి 7 మంది ఎంపిటిసిలు హాజరయ్యారు. అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి నూతన పాలక వర్గాన్ని ప్రకటించారు.నేటి నుంచి మండల పరిషత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో నూతన పాలక వర్గం 5 సంవత్సరాలు కొనసాగనుంది.