ఘనంగా సీనియర్ రాజకీయ నాయకులు జాపాల సుధాకర్ జన్మదిన వేడుకలు
కందుకూరు, మేజర్ న్యూస్: కందుకూరు మండల కేంద్రంలో సీనియర్ రాజకీయ నాయకులు జాపాలా సుధాకర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాలివాహన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బాలయ్య, మండల అధ్యక్షులు జాపాల ఈశ్వరయ్య, ఎగిరిశెట్టి నరేష్, బొడ్డు పల్లి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండ ఆంజనేయులు ఆధ్వర్యంలో జాపాల సుధాకర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎగ్గిడి సత్తయ్య, బి. మల్లేష్, ఇంద్రకంటి రవీందర్ గౌడ్, శ్రీనివాస్, మాజీ సర్పంచులు కాసుల సురేష్, యాలాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సురేష్, బీజేపీ మండల అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి,జాపాల హరిబాబు, బాలరాజ్, శివయ్య గౌడ్, బిక్షపతి గౌడ్, జాపాల ప్రకాష్, మధు తదితరులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పాల్గొని సుధాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూర్, రంగారెడ్డి జిల్లా.