ఆళ్లగడ్డ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శీలం గీతా వాణి
ఆళ్లగడ్డ ఎంపీపీగా శీలం గీతావాణి
*మండల అభివృద్ధికి కృషి చేస్తా ...నూతన ఎంపీపీ శీలం గీతావాణి
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా నల్లగట్ల ఎంపీటీసీగా విజయం సాధించిన శీలం గీతావాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఆళ్లగడ్డ మండల ప్రత్యేక అధికారి శ్రీ హరి గోపాల్ ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ లు నిర్వహించారు.ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం అనంతరం శీలం గీతావాణినిఏకగ్రీవంగా ఎంపీటీ సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే మండల ఉపాధ్యక్షుడిగా దూదేకుల అశోక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా నూతన ఎంపీపీ శీలం గీతా వాణి మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఎంపీటీసీలు వారి గ్రామాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీపీగా ఎన్నికైన శీలం గీతా వాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శీల హరికుమార్ రెడ్డి దంపతులను మండల తెలుగుదేశం నాయకులు గోపిరెడ్డి వెంకట శివారెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ రఘునాథరెడ్డి, పత్తి పాపిరెడ్డి, న్యాయవాది అంజి, ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ గూడూరు సంజీవ రాయుడు, తదితరులు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా