ఎంపీపీగా సిద్ధి సునీత ప్రమాణ స్వీకారం
చీరాల: చీరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా సిద్ధి సునీత బుధవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీ ఎన్నికలో భాగంగా ఎంపీటీసీలంతా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు.ఎంపీపీగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యకు, తన ఎన్నికకు మద్దతు తెలిపిన ఎంపీటీసీలకు, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన దేవాంగపురి గ్రామ ప్రజలకు సిద్ధి సునీత, ఆమె భర్త సిద్ధి బుచ్చేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సునీత పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఎంపిటిసిలు అధికారులు అందరు సునీతకు శుభాకాంక్షలు తెలిపారు.