హొళగుంద ఎంపీపీగా బోయ జయలక్ష్మి హొళగుంద, సూర్య ప్రతినిధి
హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం టిడిపి ఎంపీపీగా బోయ జయలక్ష్మి,వైస్ ఎంపీపీ గా మిక్కిలినేని రమేష్ బాబు ఏకగ్రీవంగా గురువారం ఎన్నికయ్యారు. మండలంలో 14 ఎంపిటిసి స్థానాలు గాను 9 టిడిపి, ఒకటి బిజెపి,ఒకటి జనసేన, మూడు వైసిపి అభ్యర్థులు గెలిచారు.కూటమి పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో గురువారం మండల పరిషత్ సమావేశం హాల్లో ప్రొసీడింగ్ అధికారి సునీల్ కుమార్,ఎంపీడీవో సయ్యద్ ఉమర్ గెలుపొందిన ఎంపీటీసీ సభ్యుల ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం ఎంపీపీ అభ్యర్థి బోయ జయలక్ష్మి కి ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ సుభాన్ ప్రతిపాదించగా ఎంపీటీసీ సభ్యురాలు చినిగమ్మ బలపరిచారు.వైస్ ఎంపీపీ మిక్కిలేని రమేష్ బాబుకు ఎల్లార్తి ఎంపిటిసి సభ్యుడు మాల రామప్ప ప్రతిపాదించగా, ఇంగళదహల్ ఎంపిటిసి సభ్యురాలు కురువ ఐశ్వర్య బలపరిచారు.దింతో ఎంపీపీ,వైస్ ఎంపీపీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎంపీపీ అయినా జయలక్ష్మి, వైస్ ఎంపీపీ అయినా మిక్కిలినేని రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నూతన ఎంపీపీ బో విజయలక్ష్మి పేర్కొన్నారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులకు శాలువాలు కప్పి పూలమాలను వేసి ఘనంగా సత్కరించారు
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.