BREAKING
రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్ జాతీయ క్రీడల్లో జిల్లా యువత సత్తా చాటాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఎంపీపీగా రాజన శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నిక గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి - వరికొయ్యలను కాల్చవద్దు రాత్రికి రాత్రే ఆంధ్రకేసరి ప్రకాశం విగ్రహం తొలగించే ప్రయత్నం: అడ్డుకున్ విగ్రహ సాధన కమిటీ అనంతపురం రూరల్ మండల ఎంపీపీగా చల్లా జయకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక పొనకల్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ పై చర్చ • సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ మండలం ఉపాధ్యక్షురాలు రాఘవేంద్ర స్వామి ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా ఎల్లారం గ్రామంలో సమగ్ర భూసర్వేపై అవగాహన సదస్సు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా అరేబియన్ గుర్రాల కోసం పాట్రిక్ స్వైజ్ నిర్మించుకున్న కాలిఫోర్నియా రాంచ్.. కోట్ల విలువైన ఆస్తి విశేషాలివే!

మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మహిళా గ్రీవెన్స్‌ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Select Suryaa Now
మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మహిళా గ్రీవెన్స్‌ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి గురువారం అందుబాటులో ఉంటూ, మహిళా గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం (శ్రీనివాసరావుపేట)లో గురువారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎన్డీయే కూటమికి చెందిన నూతన మహిళా కార్పొరేటర్లతో కలిసి మహిళా గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రతి గురువారం నియోజకవర్గ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి చెప్పు కునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోందన్నారు. అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని చెప్పారు.ఇటీవల ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన నూతన మహిళా కార్పొరేటర్ల సమక్షంలో ఈసారి గ్రీవెన్స్‌ నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. మహిళా కార్పొరేటర్లు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంద న్నారు. మౌలిక వసతుల సమస్యలు, అప్పులు ఇచ్చి మోసపోవడం, దొంగతనాలు, ఉద్యోగ అవకాశాలు, కుటుంబాల్లో వేధింపులు వంటి అనేక సమస్యలతో మహిళలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఇతరులతో చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలను సైతం మహిళలు ఇక్కడ ధైర్యంగా వెల్లడిస్తున్నారని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు.ప్రతి గురువారం మహిళా గ్రీవెన్స్‌ కోసం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, మహిళలు తమకు ఎదురయ్యే చిన్న సమస్యనైనా నిర్భయంగా వచ్చి తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అండగా నిలిచిన నూతన మహిళా కార్పొరేటర్లు, కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సూర్య నాయక్