ఈనెల 25న మెగా జాబ్ మేళా
నగరం, మేజర్ న్యూస్: స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ఈనెల 25న బాపట్ల ఏపీ ఎస్ ఎస్ డి సి వారి ఆధ్వర్యములో 17 మల్టీ నేషనల్ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ, కరెస్పాండంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ మాట్లాడుతూ తీర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు కియా, హెటేరో, ఫ్లిఫ్కార్ట్, ఎయిర్టెల్, మెడ్ప్లస్, ఎస్ బిఐ, ఎల్ఐసి కంపెనీలతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగార్థులు ఉదయం 9 గంటల నుండి రెజ్యూమ్, అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్ లతో హాజరుకావాలన్నారు. అనంతరం జాబ్ మేళా బ్రోచర్లు ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు 9494609151, 9989287425
ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.